V6 News @ 10 మిలియన్స్

V6 News @ 10 మిలియన్స్

2013.. జనవరి 26వ తేదీ.. దేశం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉండగానే.. అదే రోజు మహా ఘట్టానికి వీ6 డిజిటల్ అడుగు పడింది. యూట్యూబ్ లో తన ప్రస్తానాన్ని ప్రారంభించిన వీ6 న్యూస్.. సగర్వంగా 10 మిలియన్స్.. అక్షరాల కోటి మంది సబ్ స్క్రైబర్స్ పూర్తి చేసుకుంది. ఇది జస్ట్ నెంబర్ మాత్రమే.. అంతకు మించి తెలంగాణానే కాదు.. తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్. 

కోటి మంది సబ్ స్క్రైబర్స్ ఆషామాషీ కాదు.. తెలంగాణ జనం నాలుగు కోట్ల మందిలో.. కోటి మంది వీ6 యూట్యూబ్ కు కనెక్ట్ అయ్యారు. మన రాష్ట్రంలోని వారు మాత్రమే కాదు.. దేశ, విదేశాల్లోని ప్రతి ఒక్కరికి వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్ ఓ ఎమోషన్. ప్రతి ఏటా వచ్చే బతుకమ్మ పండుగకు.. ప్రతి ఒక్కరూ వెతుక్కుని వచ్చేది వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్ కే.. అంతలా పాపులర్ అయ్యాయి బతుకమ్మ పాటలు. గల్లీ నుంచి వైట్ హౌస్ వరకు అరచేతిలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని పదే పదే గుర్తుకు తెస్తూ.. గుండెల్లో పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు. 

తెలంగాణ ఉద్యమాన్ని.. ఉద్వేగాన్ని ముందుకు తీసుకెళ్లటంలోనూ వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్ పాత్ర విస్మరించలేనిది.. విడదీయరానిదీ. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు మారి ఉండొచ్చు కానీ.. ఆ ప్రజా ప్రతినిధులు మాట్లాడిన ప్రతి మాటకు వీ6 యూట్యూబ్ ఛానెల్ గొంతుక అయ్యింది. ప్రజల భావాలను, ప్రజా ఉద్యమాలకు సజీవ సాక్ష్యంగా కొనసాగుతూనే ఉంది. 

తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా ఒడిసి పట్టి చూపించటంలో.. అభివృద్ధిలో పడిన ప్రతి అడుగుకు ఓ వేదికగా నిలిచింది వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్. ట్రెండ్ ఏదైనా ట్రెండింగ్ ఏదైనా.. ప్రజల జీవన విధానంలో భాగం అవుతూ.. వారికి ప్రతిబింభంగా నిలిచింది. అది చరిత్ర అయినా.. చరిత్ర మరుగున దాగి ఉన్న సీక్రెట్స్ అయినా.. వెలుగులోకి తెచ్చి నేటి సమాజానికి సాక్ష్యంగా నిలిచింది వీ6 యూట్యూబ్ ఛానెల్. 

హైప్ లేదు.. హడావిడి అంతకన్నా లేదు.. వార్తను వార్తగా.. వాస్తవాన్ని వాస్తవంగా చూపించాం.. మాటలకు మర్మం లేదు.. మాయలు అంత కన్నా లేవు.. మాట్లాడింది మాట్లాడినట్లుగా ఇచ్చాం.. అందుకే వీ6 న్యూస్ యూట్యూబ్ ఛానెల్ తెలంగాణ ప్రజల వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయ్యింది.. కోటి మంది సబ్ స్క్రైబర్స్ కు చేరింది.. నాలుగు కోట్ల మందికి అభిమానం అయ్యింది.. 

ఈ డిజిటల్ జర్నీ కొనసాగుతూనే ఉంటుంది.. మీరు, మేము, మనం ఉన్నంత వరకు.. కోటి మంది సబ్ స్క్రైబర్స్ కు వందనం అభివందనం.. శతకోటి వందనాలు.. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ..