
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలోని కేజీబీవీ, యూఆర్ఎస్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని డీఈవో ఎస్.యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. కేజీబీవీల్లో 2 ఏఎన్ఎంలు, 3 అకౌంటెంట్ పోస్టులకు మహిళా అభ్యర్థులు, యూఆర్ఎస్లో 1 అసిస్టెంట్ కుక్, 1 నైట్ వాచ్మెన్ , 1 డే వాచ్ మెన్ పోస్టులకు మహిళ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
అభ్యర్థులు జిల్లాకు చెందిన వారై ఉండాలని, 18–45 సంవత్సరాల మధ్య వయసు ఉండాలన్నారు. అకౌంటెంట్‌కు కామర్స్ డిగ్రీతో పాటు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, బీకాం కంప్యూటర్ సైన్స్ అర్హత, ఏఎన్ఎంకు ఇంటర్‌తో పాటు ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలని తెలిపారు. వృత్తి విద్యా కోర్సులో జీఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్, బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.