సిటీలో ఇయాల్టి నుంచి వ్యాక్సిన్​ ప్రికాషనరీ డోస్

సిటీలో ఇయాల్టి నుంచి వ్యాక్సిన్​ ప్రికాషనరీ డోస్
  • 60 ఏండ్లు పై బడిన కోమార్బిడిటీస్ కు ప్రయారిటీ 
  • ఫ్రంట్ లైన్, హెల్త్, పోలీసు సిబ్బందికి కూడా టీకా
  • రెండో డోసుకు మధ్య తొమ్మిది నెలల గ్యాప్​ ఉండాలి

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఇయాల్టి నుంచి కొవిడ్​ వ్యాక్సిన్​ ప్రికాషనరీ(బూస్టర్) డోస్ పంపిణీ షురూ కానుంది. ముందుగా 60 ఏండ్లు పైబడిన కోమార్బిడిటీస్ వారికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు, హైల్త్ సిబ్బంది, పోలీసులకు కూడా అందిస్తారు. మూడో డోస్ వ్యాక్సిన్ డ్రైవ్ ని మొఘల్ పురాలోని గవర్నమెంట్ నిజామియా జనరల్ హాస్పిటల్ లో అధికారికంగా ప్రారంభిస్తా రు. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 95 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పంపిణీ చేస్తారు. ఇప్పటికే అరవై ఏండ్లు పైబడి రెండు డోసులు తీసుకున్న వారు మూడో డోస్ కోసం నేరుగా సెంటర్​కి వెళ్లొచ్చని, రిజిస్ట్రేషన్ అవసరంలేదని హైదరాబాద్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్​ శ్రీకళ పేర్కొన్నారు.ఒక్కో సెంటర్ కి 250 డోస్ లు అందిస్తున్నామని, అవసరమున్న చోట మరిన్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి మూడో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభిస్తుండగా ఇంతకు ముందు రెండు డోస్‌‌‌‌లు తీసుకున్న వారు బూస్టర్‌‌‌‌ డోస్​కి అర్హులని చెప్పారు. ప్రత్యేకంగా స్లాట్ బుకింగ్ అవసరం లేదని, అందుబాటులోని వ్యాక్సినేషన్ సెంటర్​కి వెళ్లి తీసుకోవచ్చని డీఎంహెచ్​ఓ తెలిపారు.
 

ఇంతకుముందు ఏ వ్యాక్సిన్​ తీసుకుంటే అదే..
మొదటి రెండు డోస్‌‌‌‌లు ఏ వ్యాక్సిన్‌‌‌‌ వేసుకున్నరో అదే బూస్టర్‌‌‌‌ డోస్‌‌‌‌గా ఇస్తారు. రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకున్న 9 నెలల మధ్య గ్యాప్​ ఉన్నవారే తీసుకోవాలి. వృద్ధులు ఆధార్ కార్డ్ లేదా, రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకుని సెంటర్​కు వెళ్లాలి. ముందుగా కొవిన్ పోర్టల్​లో డీటెయిల్స్ చెక్ చేస్తారు. సెకండ్ డోస్ తీసుకున్న రోజుకు ప్రస్తుత రోజుకు మధ్య తొమ్మిది నెలల గ్యాప్ ఉంటేనే బూస్టర్ ​డోసు అందిస్తారు. కోమార్బిడిటీస్ ఉన్నవారు డాక్టర్ల నుంచి మెడికల్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.  పోలీసు సిబ్బందికి కూడా ఇవ్వనుండగా డిపార్ట్​మెంట్​అభ్యర్థన మేరకు సిటీలో నాలుగు సెంటర్లను ఏర్పాటు చేశారు. పేట్లబురుజు సిటీ ఆర్డ్మ్​ ​​రిజర్వ్​లో ఓ వ్యాక్సిన్ సెంటర్​ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో పని చేసేవాళ్లకి ఇవ్వనున్నారు. అంబర్ పేట్ సీపీఎల్ గ్రౌండ్స్ లో రాచకొండ లిమిట్స్ లో పనిచేసే పోలీసులకు చార్మినార్​లోని చేలాపురాలో, బేగంపేట పోలీస్ హాస్పిటల్​లో ఆయా ఏరియాల పరిధిలోని పోలీసు సిబ్బందికి బూస్టర్ డోస్ అందిస్తారు.