రేవంత్​కు సీఎం కుర్చీ కేసీఆర్​పెట్టిన బిక్షే : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

రేవంత్​కు సీఎం కుర్చీ కేసీఆర్​పెట్టిన బిక్షే : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
  • ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

భద్రాద్రికొత్తగూడెం/ఇల్లెందు, వెలుగు : రేవంత్​ రెడ్డికి సీఎం కుర్చీ కేసీఆర్​ పెట్టిన బిక్షేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎల్కతుర్తిలో ఈ నెల 27వ నిర్వహించే బీఆర్​ఎస్​ పార్టీ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరుతూ ఇల్లెందులో మంగళవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్​పోరాటం చేయకపోతే రాష్ట్ర వచ్చేది కాదన్నారు. కేసీఆర్​ను దూరం చేసుకొని తప్పు చేశామని ప్రజలంతా బాధ పడుతున్నారని తెలిపారు. 

కాంగ్రెస్​ ఏడాదిన్నర పాలనలో ప్రజలు విసిగి పోయారని, ఎల్కతుర్తి సభలో కేసీఆర్​ ఏం మాట్లాడుతారోనని ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. కాగా, బీఆర్​ఎస్​ 25ఏండ్ల పేరంటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలంటూ ఆ పార్టీ​నేతలు ఇల్లెందు పట్టణం ఏడో వార్డులో ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెడ్తూ ప్రచారం నిర్వహించారు.  సమావేశంలో బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే భానోత్​ హరిప్రియ, నేతలు దిండిగాల రాజేందర్​, అంగోత్​ బిందు, లక్కినేని సురేందర్, సంజీవ్​ నాయక్, రమేశ్, రంగనాథ్, సిలివేరి సత్యనారాయణ, పర్చూరి వెంకటేశ్వర్లు, జేకే శ్రీనివాస్​పాల్గొన్నారు. 

ఖమ్మం–మహబాద్ రోడ్డుకు ‘వనజీవి’ పేరు పెట్టాలి 

ఖమ్మం రూరల్ : ఖమ్మం–-మహబూబాబాద్ రోడ్డుకు ‘వనజీవి’ పేరు పెట్టాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. మంగళవారం ఖమ్మం రూరల్​ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని వనజీవి రామయ్య ఇంటి వద్ద ఆయన ఫొటోకు ఎంపీ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ వనజీవి రామయ్య జీవితం మొక్కలు నాటాడానికే అంకితం చేశారని, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు.