వడోదర కుర్రాడి ప్రతిభ.. రోబోటిక్ జగన్నాథ రథయాత్ర

వడోదర కుర్రాడి ప్రతిభ.. రోబోటిక్ జగన్నాథ రథయాత్ర

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీలో భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథ రథచక్రాలు కదిలాయి. కరోనా కారణంగా.. గత రెండు సంవత్సరాలుగా రథయాత్రను నిర్వహించలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తులను అనుమతించారు.

అయితే.. గుజరాత్ లోని వడోదరలో ఓ యువకుడు వినూత్నంగా రథయాత్ర నిర్వహించాడు. రోబోటిక్ రథాన్ని తయారు చేసి జగన్నాథ స్వామిని అందులో పెట్టి ఊరేగించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సైన్, సంప్రదాయాల సమ్మేళ్లమని ఆ యువకుడు వెల్లడించాడు. రోడ్డుపై వెళుతుండగా.. కుటుంబసభ్యులు, భక్తులు మంత్రాలు చదువుతూ పూలు చల్లారు.