
ఉప్పెన, కొండపొలం చిత్రాలతో మంచి మార్కులు వేయించుకున్న వైష్ణవ్ తేజ్.. ప్రస్తుతం ‘రంగరంగ వైభవంగా’ మూవీలో నటిస్తున్నాడు. కేతికాశర్మ హీరోయిన్. ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్ తీసిన గిరీశాయ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని మే 27న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. రిషి పాత్రలో వైష్ణవ్, రాధ అనే పాత్రలో కేతిక కనిపించ నున్నట్టు కూడా చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అట్రాక్టివ్‌గా ఉంది. టేబుల్ మీద ఉన్న పుస్తకాలు, స్టెతస్కోప్‌ని బట్టి వైష్ణవ్, కేతిక మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అని అర్థమౌతోంది. జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేస్తున్నట్టు చెప్పిన దర్శకుడు.. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నాడు. ఈ సినిమా రిలీజవుతున్న రోజే అడివి శేష్ ‘మేజర్’ కూడా థియేటర్స్‌కి రానుంది.