
ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda)– వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా నటించిన ‘బేబీ’(Baby ) సినిమా విడుదలకు సిద్ధమైంది. ‘కొబ్బరిమట్ట’ ఫేం సాయి రాజేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ‘ఓ రెండు మేఘాలిలా సాంగ్..’, ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాకు భారీ హైప్‌ను తీసుకువచ్చాయి.
తాజాగా ఈ మూవీ టీం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది. ఎక్కడో యూట్యూబ్ వీడియోలు చేసుకునే తనను నమ్మి ఇంత మంచి సినిమాలో చాన్స్ ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్ చెప్పింది. ఈ సినిమా చేసినందుకు తనకు లభిస్తున్న గౌరవం, ఆదరణ ఇంతకుముందెప్పుడూ లేని అనుభూతినిస్తోందని తెలిపింది.
ఆయన వల్లే ఈ కొత్త ప్రపంచాన్ని చూస్తున్నానంటూ కంటతడి పెట్టుకుంది. ఇక ఈ సినిమా ఈ నెల 14 ప్రేక్షకుల ముందుకు రానుంది.