కృతి శెట్టికి కూడా ఇలానే జరిగింది.. అందుకే ఈ జాగ్రత్త

కృతి శెట్టికి కూడా ఇలానే జరిగింది.. అందుకే ఈ జాగ్రత్త

షార్ట్​ఫిలిమ్స్​, వెబ్​ సీరిస్​లతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya).  అందివచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ’బేబీ(Baby)‘ చిత్రంతో వెండి తెరకు తెలుగు హీరోయిన్​గా పరిచయం అయింది.  ఈ చిత్రం సూపర్​ హిట్​ టాక్​తో దూసుకుపోతుంది. ఒక్క సారిగా వచ్చిన పాపులారిటీతో వరుస అవకాశాలు రావడం సహజం.

భారీ రెమ్యునరేషన్​ వస్తుందని పిచ్చి ప్రాజెక్టులకు సైన్​ చేస్తే ఆమె అద్భతమైన కెరీర్​కు రిస్క్​తప్పదంటున్నారు సినీ విశ్లేషకులు. ఫస్ట్​ సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్​అయిన కృతిశెట్టి(Kriti shetty) విషయంలో జరిగిన పొరపాటు వైష్ణవి చైతన్య విషయంలో పునరావృతం కాకుండా చూసుకోవాలంటున్నారు.  వరుసగా అవకాశాలు రావడంతో ఆలోచించకుండా వాటిని ఒప్పుకోవడంతో వరుస ప్లాప్​లతో సినీ కెరీర్​ని నెట్టుకొస్తుంది కృతి శెట్టి.   అందుకే వచ్చిన ఆఫర్ లని ఆలోచించి ఎంపిక చేసుకోవాలంటున్నారు.