హైదరాబాద్, వెలుగు: వాలంటైన్స్ డే సందర్భంగా వొడాఫోన్ ఐడియా (వీ) సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. జూమిన్‌తో పార్టనర్‌షిప్ కుదుర్చుకున్న ఈ కంపెనీ, వీ వీఐపీ నెంబర్లు తీసుకున్నవారికి రూ. 299 విలువైన జూమిన్ ఫోటోబుక్‌ను ఫ్రీగా అందుకునే అవకాశాన్ని కలిపిస్తోంది. యూజర్లు తమకు కావాల్సిన వారి కోసం వీ నుంచి కస్టమైజ్డ్ మొబైల్ నెంబర్‌ను తీసుకోవచ్చని తెలిపింది. బర్త్‌డే, యానివర్శరీ డేట్ వంటివి ఇటువంటి మొబైల్ నెంబర్స్ కోసం వాడుకోవచ్చు. వీ పోస్ట్‌పెయిడ్ సిమ్‌ను తీసుకునేవారు కస్టమైజ్డ్ ఫోటోబుక్‌ను పొందొచ్చని వివరించింది. ఈ ఆఫర్‌ను పొందాలంటే మొదట వీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వీఐపీ మొబైల్ నెంబర్‌ను ఆర్డర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత యూజర్‌కు ఓ కూపన్ కోడ్ వస్తుంది. తర్వాత జూమిన్ వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి కస్టమైజ్డ్ ఫోన్‌బుక్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. యూజర్లు తమకు నచ్చిన ఫోటోలను యాడ్ చేయాలి. పైన వచ్చిన కూపన్ కోడ్‌ను వాడితే రూ. 299 విలువైన కస్టమైజ్డ్ ఫోన్‌బుక్ ఫ్రీగా వస్తుంది. కాగా, ఈ ఫోన్‌బుక్‌ను డెలివరీ చేయడానికి ఛార్జీ వసూలు చేస్తారు.
