
ఎప్పుడూ సీరియస్ కాన్సెప్ట్స్‌ని సెలెక్ట్ చేసుకునే విద్యాబాలన్.. ఈసారి కాస్త హ్యూమరస్‌గా కనిపించేందుకు రెడీ అవుతోంది. శీర్ష గుహ డైరెక్షన్‌లో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీ కథ.. రెండు ప్రేమ జంటల చుట్టూ తిరుగుతుంది. విద్యకి జంటగా ‘స్కామ్ 1992’ ఫేమ్ ప్రతీక్ గాంధీ నటిస్తున్నాడు. ఇలియానా, సెంథిల్ రామస్వామి మరో జంటగా కనిపించనున్నారు. శీర్ష గుహ డైరెక్ట్ చేస్తున్నారు. నిన్నటితో షూటింగ్ పూర్తయ్యింది. ఈ మూవీతో జర్నీ మొత్తం ఓ నవ్వుల రైడ్‌లా జరిగిందంటోంది విద్య. ‘ఇదో అద్భుతమైన రొమాంటిక్ కామెడీ డ్రామా. ఊటీలో షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేశాను. జీవితాంతం గుర్తుండే మెమొరీస్ దొరికాయిక్కడ’ అంటూ షూట్ కంప్లీటైన విషయాన్ని ఈ ఫొటోతో పాటు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్‌ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి, వేలెంటైన్స్ డేకి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్స్‌లో ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి రొమాంటిక్ మూవీని చూసి ఉండరంటోంది టీమ్. విద్య నటిస్తోందంటే కచ్చితంగా ఏదో స్పెషల్ స్టోరీయే అయ్యుంటుందిగా మరి!