
- స్వాగతం పలికిన జిల్లా అధికారులు
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి బాధ్యతలు స్వీకరించారు. గురువారం కలెక్టర్ఆఫీస్కు వచ్చిన ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. నేరుగా తన చాంబర్‌కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యా, వైద్యం, మహిళ శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.
ప్రజాపాలన అప్లికేషన్లను పరిశీలించి అర్హులకు పథకాలు అందేలా చూస్తానన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలున్నా త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్కలెక్టర్లు చంద్ర శేఖర్, మాధురి, జిల్లా రెవెన్యూ అధికారి నగేశ్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది కలెక్టర్ కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.