వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రిలీజ్

వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రిలీజ్

సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు చిరంజీవి. బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌కు సంబంధించి ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు చార్ట్‌‌బస్టర్‌‌లుగా నిలిచాయి. ‘తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడు’ అంటూ సాగే టైటిల్‌‌ సాంగ్‌‌ను సోమవారం రిలీజ్ చేశారు. పవర్‌‌‌‌ఫుల్‌‌గా సాగిన ఈ పాటను బ్యాంకాక్ మ్యుజీషియన్స్‌‌తో కలిసి రికార్డు చేశారు దేవిశ్రీ ప్రసాద్. 

‘భగ భగ భగ మండే.. మగ మగ మగాడురా వీడే..  జగ జగ జగాన్ని చెండాడే.. ధగ ధగ జ్వలించు సూరీడే.. అగాధ గాథల అనంత లోతుల.. సముద్ర సోదరుడే వీడే.. వినాశ కారుల స్మశానమౌతాడే.. తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే అది వీడే.. తలల్ని తీసే విశిష్టుడే వీడే’ అంటూ వీరయ్య క్యారెక్టర్‌‌‌‌ను హైలెట్‌‌ చేస్తూ చంద్రబోస్ లిరిక్స్ రాశారు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్‌‌గా పాడాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌లో మెషీన్ గన్‌‌ పట్టుకుని మాస్‌‌ గెటప్‌‌లో స్టైలిష్‌‌గా కనిపిస్తున్నారు చిరంజీవి. ఇక చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.