పోలీస్ స్టేషన్​లోకి దూసుకెళ్లిన వ్యాన్

పోలీస్ స్టేషన్​లోకి దూసుకెళ్లిన వ్యాన్

అశ్వారావుపేట, వెలుగు : అశ్వరావుపేట పోలీస్​ స్టేషన్​లోకి ఆదివారం రాత్రి ఓ డీసీఎం వ్యాన్​ దూసుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీసీఎం వ్యాన్ డ్రైవర్ అతిగా మద్యం సేవించి వ్యాన్ వేగంగా నడిపాడు.

దీనిని గమనించిన స్థానికులు వ్యాన్​ను ఆపేందుకు ప్రయత్నించగా స్పీడ్​గా వెళ్లి పోలీస్ స్టేషన్ గేటును ఢీకొట్టింది. దీంతో వ్యాన్​ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.