జూన్ 2024 నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లు

జూన్ 2024 నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లు

కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది.  వీటిని  వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించి... జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ రైళ్లు  రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోటీపడతాయన్నారు.వందే భారత్ రైలు స్లీపర్ రైళ్ల  డిజైన్ ను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF) తయారు చేస్తుంది.  ప్రస్తుత వందే భారత్ రైళ్లలో చైర్ కార్ కోచ్‌లు మాత్రమే  ఉన్నాయి.  కొత్తగా తొలి విడతలో 22 వందే భారత్ స్లీపర్ రైళ్లను అభివృద్ది చేయనున్నారు. 

 మూడు  ఫార్మాట్‌లు

1.  100 కి.మీ కంటే తక్కువ ప్రయాణానికి, వందే భారత్ రైలు మెట్రో అందుబాటులో ఉంటుంది.
2.  100 కి.మీ నుండి 550 కి.మీ మధ్య ప్రయాణానికి, వందే భారత్ రైలు చైర్ కార్ తో తయారు చేస్తున్నారు
3.  550 కి.మీ దాటి ప్రయాణించడానికి వందే భారత్ రైలులో  స్లీపర్ కోచ్ లు ఉంటాయి