ఢిల్లీ నుంచి అయోధ్యకు వందే భారత్ రైళ్లు

ఢిల్లీ నుంచి అయోధ్యకు వందే భారత్ రైళ్లు

==================================================================

Vande Bharat train  from Delhi to Ayodhya semi high speed train only 8 hours journey
Vande Bharat, Delhi to Ayodhya train, New Vande Bharat, Indian Railways, Vandebharat train, 8 hours journey, Delhi -- lucknow- Ayodhaya, latest news, railway news, telugu news, india news

దేశంలోని ప్రజలు సెమీ హై స్పీడ్​ను చాలా ఇష్టపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి దేశం త్వరలో మరో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ రైలు పట్టాలెక్కబోతుంది.  వందేభారత్​ లో ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి చేరుకుంటుంది. ఎక్కువమంది ఈ రైలులో ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నాకు.  దీనికారణంగా వందేభారత్​ ఎక్స్​ ప్రెస్​ సంఖ్యను నిరంతరం పెంచుతోంది. 


 ఆనంద్ విహార్ (ఢిల్లీ) , లక్నో ,  అయోధ్య మధ్య నడిచే మరో వందే భారత్ రైలును ప్రారంభించేందుకు  ప్రభుత్వం సన్నాహాలు జరుపుతుంది.   గోరఖ్‌పూర్ .. లక్నో మధ్య  నడిచే ట్రైన్​ ను   ప్రయాగ్‌రాజ్ వరకు విస్తరించాలని  రైల్వేశాఖ యోచిస్తోంది. రైలు కోచ్ ఫ్యాక్టరీ నుండి ఉత్తర రైల్వేకి 16 బోగీలు కేటాయించబడ్డాయివందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆనంద్ విహార్ నుండి లక్నోకు ఎనిమిది గంటల్లో చేరుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.  అయితే ఈ ట్రైన్​ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా ప్రకటించలేదు. 

ఆనంద్​ విహార్​.. అయోధ్య నడిచే వందేభారత్​ ట్రైన్​ 160 కిలో మీటర్ల వేగంతో దేశంలో మొదటి స్వదేశీ సెమీ-హై-స్పీడ్ రైలు. దీనిలో GPS ఆధారంగా   ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్ Wi-Fi , ఆడియో - విజువల్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, దివ్యాంగులకు  ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లాలనుకునే వారికి ఈ రైలు చాలా ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. 


UP ప్రభుత్వం కూడా అయోధ్యలో పర్యాటక ఫెసిలిటేషన్ సెంటర్‌ను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికపై పని చేస్తోంది. 4.40 ఎకరాల విస్తీర్ణంలో రూ.130 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని అంచనా. ఈ కేంద్రాలు ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో అభివృద్ధి చేయబడతాయి, జాతీయ రహదారి 330 మరియు జాతీయ రహదారి 27తో కనెక్టివిటీని నిర్ధారిస్తుంది.