HappyJourney: దేశభక్తి స్ఫూర్తితో హ్యాపీ జర్నీ.. ఆసక్తిరేపుతున్న‘వందేమాతరం’ సాంగ్‌

HappyJourney: దేశభక్తి స్ఫూర్తితో హ్యాపీ జర్నీ.. ఆసక్తిరేపుతున్న‘వందేమాతరం’ సాంగ్‌

హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్  హీరో హీరోయిన్లుగా చైతన్య కొండా దర్శకత్వంలో గంగాధర్ పెద్ద కొండ నిర్మించిన ఎమోషనల్ ఎంటర్‌‌టైనర్  ‘హ్యాపీ జర్నీ’. షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘వందేమాతరం’ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్.

ఈ సందర్భంగా నిర్మాత గంగాధర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నాం.  దేశభక్తి నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులోని వందేమాతరం పాటకు  ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది.

అలాగే సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాం’అని అన్నారు. బలమైన ఎమోషన్స్‌తో ఈ చిత్రం రాబోతోందని దర్శకుడు చైతన్య అన్నాడు.  దువ్వాసి మోహన్, సంజయ్ రాయచూర, ఆనంద్ భారతి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చైతన్య రాజ్ సంగీతం అందిస్తున్నాడు.