టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన జీవితంలోనే అత్యంత మధురమైన క్షణాలను ఆస్వాదిస్తోంది. ఇటీవలే తన బేబీ బంప్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. ‘మై సిక్స్ ప్యాక్.. ఐ విల్ సీ యు వెన్ ఐ సీ యు’ అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చిన పోస్ట్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఓ క్రేజీ వీడియో షేర్ చేసి మరోసారి సర్‌ప్రైజ్ చేసింది. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా సమంత తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వర్కౌట్స్‌ను కొనసాగిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో..
సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో జూన్ నెలకు సంబంధించిన ఫోటో డంప్‌ను షేర్ చేసింది. అందులో ఆమె ప్రెగ్నెన్సీ సమయంలో చేస్తున్న వర్కౌట్‌కు సంబంధించిన వీడియో కూడా ఉంది. వీడియోలో సమంత అప్పర్ బాడీ వ్యాయామాలు చేస్తూ కనిపించింది. ఒక రాడ్‌కు కట్టిన తాడును ఉపయోగిస్తూ వ్యాయామం చేస్తున్న సామ్, ప్రతి సెట్ పూర్తయ్యాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. ఈ వీడియోలో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Workout anyway
— Samcults (@Samcults) July 2, 2026
Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu#MaaIntiBangaaram pic.twitter.com/bcbkqP00TU
అయితే వర్కౌట్ మధ్యలో సమంత కొంత అలసటగా కనిపించినప్పటికీ, తన ఫిట్‌నెస్‌పై చూపిస్తున్న అంకితభావం అభిమానులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ టైంలో ఇలా వర్కౌట్స్ చేయడం మంచిదేనా? అని చర్చించుకుంటున్నారు. అయితే గర్భిణులు పొట్టపై ఎలాంటి ఒత్తిడి పడకుండా వ్యాయామం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పైగా ఈ వర్కౌట్స్ వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగకపోవడం, బీపీ, షుగర్‌లు అటాక్ కాకుండా ఉండటం, నడుమునొప్పి నుంచి రిలీఫ్, నార్మల్ డెలివరీకి అధిక అవకాశాలు ఉంటాయంటున్నారు.
జూన్ ఫోటో డంప్‌లో ప్రత్యేక ఆకర్షణలు..
సమంత షేర్ చేసిన జూన్ ఫోటో డంప్‌లో ఆమె పెంపుడు కుక్కలు, పిల్లి ఫోటోలు, ఒక అందమైన సెల్ఫీ, చీరలో దిగిన ఫోటో, భర్త రాజ్ నిడిమోరుతో కలిసి విమాన ప్రయాణంలో తీసుకున్న సెల్ఫీ కూడా ఉన్నాయి. అలాగే కారులో తీసుకున్న ఓ ఫోటోలో సమంత తన మంగళసూత్రాన్ని చూపిస్తూ కనిపించింది.
అంతేకాకుండా తాను నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయాన్ని కూడా ఆమె ఈ పోస్టులో ప్రస్తావించింది. ఈ పోస్టుకు సమంత "జూన్ నెల ఓ అద్భుతమైన కలలా అనిపించింది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అభిమానుల ఆందోళన..
39 ఏళ్ల వయసులో సమంత తన తొలి బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒక అభిమాని, ‘లవ్ యూ సామ్.. మీ చిన్నారిని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ కామెంట్ చేశాడు. మరికొందరు అభిమానులు సమంత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని, ఈ సమయంలో తన ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఓ అభిమాని ఎమోషనల్ అవుతూ ‘సమంత, ఎన్నేళ్లుగా మీ అభిమానిగా ఉన్న నేను మీరు ప్రతి రోజూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ధైర్యం, పట్టుదల, చిరునవ్వు ఎంతో మందికి స్ఫూర్తి. మీ ఆరోగ్యం మాకు చాలా ముఖ్యమైనది. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటమే మాకు పెద్ద బహుమతి’ అని పేర్కొన్నాడు.
