జ్ఞాన వాపి మసీదు ఆవరణలో ASI సర్వేకు అనుమతి

జ్ఞాన వాపి మసీదు ఆవరణలో ASI సర్వేకు అనుమతి

హిందూ దేవాలయం పూర్వ నిర్మాణంపై మసీదును నిర్మించారా లేదా అని తెలుసుకోవడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI).. జ్ఞాన వాపి మసీదు ప్రాంగణాన్ని సర్వే చేసేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది. అయితే శివలింగాన్ని పోలి ఉండే   ప్రాంతాన్ని సర్వే పరిధి నుంచి మాత్రం తప్పించాలని కోర్టు సూచించింది. "నా దరఖాస్తు ఆమోదించినట్టు నాకు సమాచారం అందింది. వాజు ట్యాంక్ మినహా జ్ఞానవాపి మసీదు సముదాయంలో ASI సర్వే నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం దీన్ని సీల్ చేశారు. ఈ సర్వే 3 నుంచి 6 నెలల్లో పూర్తవుతుందని నేను భావిస్తున్నాను" అని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో హిందూ పక్షాన వాదిస్తున్న విష్ణు శంకర్ జైన్ తెలిపారు.

జ్ఞాన వాపి మసీదు ప్రాంగణంలోకి ఏడాది పొడవునా పూర్తి ప్రవేశాన్ని అభ్యర్థిస్తూ నలుగురు వారణాసి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై  శృంగార గౌరీ, గణేష్, హనుమాన్, నంది దేవతలను  ప్రతి రోజూ పూజించేందుకు అనుమతిని కోరుతూ వారు ఈ ఏడాది మేలో సెక్షన్ 75(ఇ), CPC యొక్క ఆర్డర్ 26 రూల్ 10A ప్రకారం ఫిర్యాదు చేశారు.

హిందూ పక్షం అభ్యర్థించిన ఎఎస్ఐ సర్వేను మసీదు కమిటీ వ్యతిరేకించింది.  ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని  ఆక్రమించి ధ్వంసం  చేశారన్న హిందూ పక్షం వాదనను కూడ ముస్లిం పక్షం తోసిపుచ్చింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు క్రూరమైనవాడు కాదని మసీదు కమిటీ పేర్కొంది. వారణాసిలో  విశ్వేశ్వరాలయాన్ని కూల్చివేయలేదని మాత్రం స్పష్టం చేసింది.

#WATCH | Gyanvapi case: Vishnu Shankar Jain, representing the Hindu side in the Gyanvapi mosque case, says, "I have been informed that my application has been approved and the court has directed to conduct an ASI survey of the Gyanvapi mosque complex, excluding the Wazu tank… pic.twitter.com/TX4hXzyZ5j

— ANI (@ANI) July 21, 2023