కిచెన్ తెలంగాణ : మొక్కజొన్న.. మోర్ టేస్టీ!

కిచెన్ తెలంగాణ : మొక్కజొన్న.. మోర్ టేస్టీ!

మొక్కజొన్న పొత్తుల్ని కాల్చి లేదా ఉడికించి తింటుంటారు. కానీ, వాటితో బోలెడన్ని వెరైటీలు చేయొచ్చు. ఒకటేమో బటర్ బాత్​ చేసిన కార్న్, ఇంకోటేమో ఎర్రని తందూరీ కార్న్.. అంతెందుకు కార్న్​తో ఉప్మా, బ్రెడ్​, కార్న్ కలిపి మసాలా టోస్ట్​ కూడా చేసేయొచ్చు. 

కార్న్ ఉప్మా 

కావాల్సినవి :

మొక్కజొన్న కంకులు – రెండు
నూనె – రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిగడ్డ, టొమాటో – ఒక్కోటి
ఉప్పు – సరిపడా
కొత్తిమీర తరుగు – కొంచెం
పచ్చిమిర్చి – నాలుగు
పోపు దినుసులు – ఒక టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్

తయారీ :మొక్కజొన్న కంకుల నుంచి గింజలు వలిచి, వాటిని మిక్సీజార్​లో వేసి కచ్చాపచ్చాగా​ చేయాలి. తరువాత పాన్​లో నూనె వేడి చేసి, పోపు దినుసులు వేయాలి. తర్వాత ఉల్లిగడ్డ, టొమాటో, పచ్చిమిర్చి  తరుగు, కరివేపాకు వేగించాలి. అందులో పసుపు కలపాలి. ఆ తర్వాత కార్న్​ పేస్ట్​, ఉప్పు కూడా కలపాలి. ఫైనల్​గా కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి కార్న్​ ఉప్మా తినడానికి రెడీ.