ఎంపీలకు అందుతున్న సౌలతుల రద్దుపై చర్చించాలి

ఎంపీలకు అందుతున్న సౌలతుల రద్దుపై చర్చించాలి

న్యూఢిల్లీ: ప్రజలకిచ్చే ఉచిత పథకాల అంశంకంటే ముందు ఎంపీలకు ఇచ్చే పెన్షన్, ఇతర సదుపాయాల రద్దుపై పార్లమెంట్​లో చర్చించాలని బీజేపీ ఎంపీ వరుణ్ ​గాంధీ ట్వీట్​ చేశారు. ఉచితాల రద్దు అంశంపై చర్చించాలని బీజేపీ ఎంపీ సుశీల్​ కుమార్​ మోడీ  రాజ్యసభలో ప్రతిపాదించడాన్ని ట్వీట్​కు జతచేశారు. ‘‘ప్రజలకు అందే ఉచితాలపై చర్చించే ముందు మన గురించి కూడా మనం ఆలోచించాలి.  ఎంపీలకు అందుతున్న సౌలతులు, పెన్షన్ల రద్దు అంశాన్ని డిస్కస్​ చేస్తే బాగుంటుంది” అని పేర్కొన్నారు.

అదేవిధంగా.. పెరిగిన సిలిండర్​ ధర వల్ల, నామ్కే వాస్తే సబ్సిడీ వల్ల ఉజ్వల స్కీమ్​ లక్ష్యం నెరవేరట్లేదని వరుణ్​గాంధీ మరో ట్వీట్​లో పేర్కొన్నారు.  గత ఐదేండ్లలో 4.13 కోట్ల మంది ఒక్క ఎల్పీజీని కూడా కొనుగోలు చేయలేదని, 7.67 కోట్ల మంది కేవలం ఒక్క ఎల్పీజీని మాత్రమే రీఫిల్​ చేశారని ఆయన వివరించారు.