మెగా ఎంగేజ్మెంట్ : ఒక్కో రింగ్ రూ.25 లక్షలు.. చీర రూ.75 వేలు

మెగా ఎంగేజ్మెంట్ : ఒక్కో రింగ్ రూ.25 లక్షలు.. చీర రూ.75 వేలు

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ఎంగేజ్మెంట్ జూన్ 9న లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)తో జరిగిన విషయం తెలిసిందే. గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. పెద్ద వాళ్ళను ఒప్పించి పెళ్ళికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని మణికొండలో నాగబాబు(nagababu) ఇంట్లో జరిగిన ఈ వేడుకకు మెగా కుటుంబం అంతా అటెండ్ అయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఎంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్లో వరుణ్, లావణ్య మార్చుకున్న ఉంగరాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. దీంతో వీటి కాస్ట్ ఎంత అని తెల్సుకోవడానికి నెటిజన్స్ సెర్చింగ్ మొదలుపెట్టేశారు. తీరా తెసులుకున్నాక అవాక్కాయ్యారు. వరుణ్, లావణ్య మార్చుకున్న ఒక్కో రింగ్ ఖరీదు అక్షరాలా పాతిక లక్షలట. తమ జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ మూమెంట్ కోసం ఈ జంట చేసిన ఖర్చు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఈవెంట్ లో లావణ్య త్రిపాఠి ధరించిన చీర కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే రూపొందించిన ఈ బనారస్ చీర ఖరీదు కూడా చాలా ఎక్కువే. ఈ చీర కోసం లావణ్య రూ. 75000 ఖర్చు చేసిందని సమాచారం.

ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్.. ఎంగేజ్మెంట్ కోసమే ఈ రేంజ్లో ఖర్చు చేస్తున్నారంటే.. ఇక పెళ్ళి ఏ లెవల్లో జరగనుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.