బాక్సర్‌గా వరుణ్ తేజ్.. బ్రదర్‌ కోసం వాయిస్ ఇచ్చిన చెర్రీ 

బాక్సర్‌గా వరుణ్ తేజ్.. బ్రదర్‌ కోసం వాయిస్ ఇచ్చిన చెర్రీ 

‘ఎఫ్‌‌‌‌‌‌‌‌ 2’లో భార్యా బాధితుడిగా నవ్వులు పూయించాడు. ఆ తర్వాత ‘గద్దలకొండ గణేష్‌‌‌‌‌‌‌‌’గా గడగడలాడించాడు. ఇప్పుడు బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పంచ్‌‌‌‌‌‌‌‌లు కురిపిస్తానంటున్నాడు. ఈ సినిమాలు, క్యారెక్లర్లు చూస్తుంటేనే అర్థమవుతోంది.. వరుణ్‌‌‌‌‌‌‌‌ తేజ్ ఎంత డిఫరెంట్ దారిలో సాగుతున్నాడో. నిన్న రిలీజైన ‘గని’ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూశాక నటుడిగా తను ఎంత కమిటెడ్‌‌‌‌‌‌‌‌ అనేది కూడా అర్థమయ్యింది. బాక్సింగ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం వరుణ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ అతని కష్టం కనిపించింది. రామ్ చరణ్ వాయిస్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ టీజర్ మొదలైంది. ‘ప్రతి ఒక్కరి కథలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. కోరికలు ఉంటాయి, కోపాలు ఉంటాయి. కలబడితే గొడవలు ఉంటాయి. అలానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ చాంపియన్ అవ్వాలనే ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే. ఆ ఒక్కడు నువ్వే ఎందుకవ్వాలి.. వై యూ?' అనే డైలాగ్‌‌‌‌‌‌‌‌తో మొదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్యాక్డ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గానూ సాగింది. 

‘ఆట ఆడినా ఓడినా రికార్డ్స్‌‌‌‌‌‌‌‌లో ఉంటావ్. కానీ గెలిస్తే మాత్రం చరిత్రలో ఉంటావ్‌‌‌‌‌‌‌‌’.. అనే డైలాగ్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది. బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదగాలనుకునే గని తపనను కళ్లకు కట్టింది. సయీ మంజ్రేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నదియా, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ‘అఖండ’ మూవీని 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించడంతో ప్లాన్ మార్చుకున్నారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 24న ‘గని’ని థియేటర్స్‌‌‌‌‌‌‌‌కి తీసుకు రానున్నట్లు టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు అనౌన్స్ చేశారు. అంటే బాలయ్యతో కాంపిటీషన్ తప్పినా ‘శ్యామ్‌‌‌‌‌‌‌‌ సింగ రాయ్‌‌‌‌‌‌‌‌’తో పోటీ పడక తప్పదన్నమాట.