
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఎంచుకుంటూ ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో ఈ మెగా హీరో ఎప్పుడు ముందుంటారు.అయితే, రీసెంట్ మూవీస్ కూడా మంచి మెసేజ్ తో పాటు ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్ తో వచ్చినవే. కానీ, ఆ సినిమాలకు మౌత్ టాక్ వచ్భిన బాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేకపోయాడు.అయినప్పటికీ వరుణ్ తన నుంచి రాబోయే సినిమాలు కూడా తనను తానుగా మలుచుకునే ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్స్ తో వస్తుండటం విశేషం.
ప్రస్తుతం వరుణ్ తేజ్ పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్(Karuna Kumar)డైరెక్షన్ లో మట్కా అనే పీరియాడికల్ జోనర్ లో వస్తున్నాడు.1958-1982 మధ్య యావత్ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగామట్కా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో వరుణ్ తెరకెక్కిస్తున్నరట.
రా అండ్ రస్టిక్ గా వచ్చే ఈ సినిమాలో వరుణ్ నాలుగు డిఫరెంట్ షేడ్స్ లో కపిస్తున్నాడట. అలాగే ఈ సినిమాలో వరుణ్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నట్లు సమాచారం.కుర్రాళ్ల కలల రాణి అయిన యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary),కెనెడియన్ బ్యూటీ నోరా ఫతేహి హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారని తెలిసిందే.
ఇపుడు ఈ లిస్టులోకి మరో భామ తోడైనట్టు టాక్.‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోని కూడా పవర్ ఫుల్ పొలిటికల్ పాత్రలో కనిపించబోతుందని సినీ సర్కిల్ లో వినిపిస్తోంది.త్వరలో ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించనున్న ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.