వయొలెన్స్‌‌‌‌ విత్ విజన్

వయొలెన్స్‌‌‌‌ విత్ విజన్

వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మట్కా’.  డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది. ఇటీవల మొదటి పాటతో మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. తాజాగా 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ని విడుదల చేశారు. 

‘వైలెన్స్ విత్ విజన్’ అనే క్యాప్షన్‌‌‌‌తో వచ్చిన ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో వరుణ్ తేజ్ సోఫాలో కూర్చుని వింటేజ్ లుక్‌‌‌‌లో  కనిపించాడు.  మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.