యాక్షన్ సినిమాలంటే ఇష్టం

యాక్షన్ సినిమాలంటే ఇష్టం

ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు వరుణ్ తేజ్.అతను హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘గని’.కిరణ్ కొర్రపాటి దర్శకుడు. అల్లు బాబి,సిద్ధు ముద్ద నిర్మాతలు.ఈనెల 8న సినిమా విడుదలవుతున్న సందర్భంగా వరుణ్‌‌‌‌ తేజ్ ఇలా ముచ్చటించాడు.

ఇంగ్లీష్‌‌‌‌లో వచ్చిన రాకీ సిరీస్, మిలియన్ డాలర్ బేబి లాంటి స్పోర్ట్స్ మూవీస్ నాకిష్టం. హిందీలోనూ ఇలాంటివి వచ్చినా, తెలుగులో తక్కువ వచ్చాయి అనిపించేది. పర్సనల్‌‌‌‌గా నాకు ఇష్టమైన జానర్ కావడంతో స్పోర్ట్స్ మూవీ చేద్దామని ఇది స్టార్ట్ చేశాం. బాక్సింగ్ కూడా రెగ్యులర్ ఫైట్స్‌‌‌‌లాగే అనుకున్నా. షూటింగ్‌‌‌‌కు వచ్చాక ఎంత కష్టమో అర్థమైంది.

నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో రెండు వేరియేషన్స్ ఉంటాయి. మొదట బాక్సింగ్‌‌‌‌లో గెలవాలని ఎలాంటి గైడెన్స్ లేకుండా మొండిగా ముందుకెళుతుంటాడు. సెకెండాఫ్‌‌‌‌లో తనకు ఓ గైడెన్స్,  సపోర్ట్ సిస్టమ్ వస్తుంది. ఆ తర్వాత బాడీలో ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్ వస్తుంది. ఆ రెండు వేరియేషన్స్ చూపించడానికి ట్రై చేశా. నా కెరీర్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో ఫిజికల్‌‌‌‌గా ఎక్కువ కష్టపడ్డ సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత పర్సనల్‌‌‌‌ లైఫ్‌‌‌‌లో చాలా డిసిప్లిన్ పెరిగింది. వేరియేషన్ ఉండాలనే స్పోర్ట్స్ మూవీ తర్వాత ‘ఎఫ్‌‌‌‌ 3’ లాంటి కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌కి ఒప్పుకున్నా. రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది.  కథ నచ్చితే ఎవరితోనైనా మల్టీస్టారర్ చేయడానికి రెడీ. నాకైతే సాయి తేజ్, నితిన్‌‌‌‌లలో ఎవరితోనైనా మల్టీస్టారర్ చేయాలనుంది. 

కిరణ్ మరికొన్ని కథలు చెప్పాడు. అవి నచ్చి అడ్వాన్స్ ఇచ్చాను. అందులో నేనైనా చేస్తాను, లేక మరెవరితోనైనా ఉంటుంది. నాన్న, చెల్లి ప్రొడ్యూస్ చేస్తారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌‌‌‌లో ఓ  సినిమా చేయబోతున్నా. మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా నుంచే కొత్త బ్యానర్ స్టార్ట్ చేస్తాం. యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నిజానికి యాక్షన్ సినిమాలు చేయడానికే ఇండస్ట్రీకి వచ్చాను. కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలో అలాంటి అవకాశాలు రాలేదు. పైగా నేను నటించిన లవ్‌‌‌‌ స్టోరీస్‌‌‌‌ హిట్ అవడంతో నా కోరిక నెరవేరలేదు. అందుకే ‘గని’ లాంటి స్పోర్ట్స్ డ్రామా చేశా.  ఇప్పుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌‌‌‌లో యాక్షన్‌‌‌‌ మూవీ చేయబోతున్నా.