మెగా ఫ్యాన్స్ కు వరుణ్ తేజ్ ట్రీట్

మెగా ఫ్యాన్స్ కు వరుణ్ తేజ్ ట్రీట్

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘VT13’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇండియన్ ఏయిర్‌ ఫోర్స్ నేపథ్యంలో శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇవాళ ఇండియన్ ఏయిర్‌ ఫోర్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. వరుణ్ తేజ్ జెట్ ఫైటర్ గా అడుగులు వేస్తూ కనిపిస్తున్న ఈ స్టిల్  ఆసక్తిని రేపుతోంది. ఈ మూవీని ఎంత భారీ బడ్జెట్ తో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని ఈ పోస్టర్ చూస్తే అర్థమౌతుంది. 

కాగా, ఇది వరుణ్ తేజ్ కు 13వ చిత్రం. సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్, ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే మేకర్స్ ఈ మూవీని అధికారికంగా ప్రకటించి, లాంఛనంగా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. దేశ భక్తి నేపథ్యంలో సాగే సినిమా ఇది. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందనున్న ఈ మూవీతో వరుణ్ తేజ్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది.