జూన్ లో వరుణ్ తేజ్ – లావణ్య పెళ్లి చేసుకోబోతున్నారా.. జోరుగా ప్రచారం

జూన్ లో వరుణ్ తేజ్ – లావణ్య పెళ్లి చేసుకోబోతున్నారా.. జోరుగా ప్రచారం

మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నాడట. దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయట. గత కొంత కాలంగా..వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి మధ్య ఏదో ఉందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఈ వార్త తెరపైకి వచ్చింది.

జూన్‌లో వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీతో పాటు.. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితులు హాజరుకానున్నారట. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబసభ్యులు నిశ్చయించినట్లు తెలుస్తోంది.

ఇక వ‌రుణ్‌, లావ‌ణ్య 'మిస్ట‌ర్‌', 'అంత‌రిక్షం' చిత్రాల్లో జంటగా న‌టించారు. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే వీరిమధ్య ప్రేమ చిగిరించిందట. దీనికి తోడు మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతీ ఈవెంట్స్‌లో లావణ్య త్రిపాఠి సందడి చేయడంతో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరింది. రీసెంట్‌గా నాగబాబు కూడా వరుణ్‌తేజ్‌కు త్వరలోనే పెళ్లి చేయనున్నామని, ఈ విషయాన్ని స్వయంగా వరుణ్‌ అనౌన్స్‌ చేస్తాడని వెల్లడించిన సంగతి తెలిసిందే.