
హైదరాబాద్ , వెలుగు: ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ (సీఈ) వసంత్ నాయక్ కు పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వసంత్ నాయక్ కు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ), ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే సోమవారం ఆయన ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ హెడ్ ఆఫీస్ లో బాధ్యతలు చేపట్టారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) బాధ్యతలను ఆయన పీఎంయూ, పీడీ హోదాలో సమన్వయం చేయనున్నారు.