రాజకీయ జోక్యంతో సింగరేణికి నష్టం : వాసిరెడ్డి సీతారామయ్య

రాజకీయ జోక్యంతో సింగరేణికి నష్టం : వాసిరెడ్డి సీతారామయ్య
  •     ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య

కోల్​బెల్ట్​,వెలుగు : బీఆర్​ఎస్​ పాలనతో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగి సంస్థ మనుగడ, కార్మికుల భద్రతకు నష్టం జరిగిందని, టీబీజీకేఎస్​ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కార్మికులను మోసం చేసిందని ఏఐటీయూసీ స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు.  మంగళవారం మందమర్రి ఏరియా కాసిపేట-1 గనిపై నిర్వహించిన గేట్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఏఐటీయూసీ సింగరేణి కార్మికులకు అనేక హక్కులు, డిమాండ్లను సాధించిందన్నారు.  బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్​, లాభాల్లో వాటా

 పెన్షన్​ స్కీం, ఎస్డీఎల్​ ఆపరేటర్లకు పోర్త్​ కేటగిరి నుంచి ఆరో కేటగిరి, ఎస్​ఎల్​పీ వంటి హక్కులను ఏఐటీయూసీ సాధించినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో బీఆర్​ఎస్​, టీబీజీకేఎస్​ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కార్మికులను మోసం చేశాయని ఆరోపించారు.  మారుపేర్ల సవరణ, సొంతింటి కల నేర్చకపోవడం, మితిమీరిన రాజకీయజోక్యం, రూ.29వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వంటి చర్యలు సంస్థకు నష్టం కలిగించాయన్నారు.  కార్మికుల సమస్యలను టీబీజీకేఎస్​ పరిష్కారించలేదన్నారు.

ఈనెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ యూనియన్​ చుక్క గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.  సమావేశంలో యూనియన్​ బెల్లంపల్లి బ్రాంచి ఇన్​చార్జి చిప్ప నర్సయ్య, మందమర్రి, బెల్లంపల్లి బ్రాంచిల సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్​, వైస్​ ప్రెసిడెంట్ బియ్యాల వెంకటస్వామి, అసిస్టెంట్​ సెక్రటరీ దాసిర తిరుపతి గౌడ్​, నాగేశ్వర్​రావు, మీనుగు లక్ష్మినారాయణ, బొంకూరి రాంచందర్​, శ్రీహరి, సంపత్​, రవిందర్​, అనిల్​, రాజన్న, రఘురాం, సుందరం తదితరులు పాల్గొన్నారు.