ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో వాస్తు ప్రకారం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అంతే కాదు ఇంటిలోని గదులు మరమ్మత్తులు.. లేదా ఉన్నస్థలంలో కొత్త గదిని నిర్మించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి వెనుక ఖాళీ స్థలం ఉంటే దక్షిణ దిక్కులో గది నిర్మించుకోవచ్చా.. అలాగే డూఫ్లెక్స్ హౌస్కు మెట్లు ఏ దిక్కులో ఉండాలి.. మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం...
ప్రశ్న: ఇంటికి దక్షిణ దిక్కు (వెనకాల) కొంచెం ఖాళీ స్థలం ఉంది. అక్కడ చిన్నగా రూమ్ కట్టుకోవాలనుకుంటున్నాం. అలా కట్టుకోవచ్చా?
జవాబు: ఇంటి వెనకాల దక్షిణం వైపు స్థలం ఉన్నప్పుడు కొత్తగా చిన్న గది కట్టుకోవచ్చు. అయితే, దక్షిణ, పడమర గోడలు వాడుకుని, ఇంటికి టచ్ కాకుండా కొత్తగా నిర్మాణం చేసుకోవచ్చు.
ప్రశ్న: తూర్పు, పడమర దిక్కు రోడ్ ఉన్న స్థలంలో డూప్లెక్స్ హౌజ్ కట్టుకోవాలనుకుంటున్నాం. మెట్లు ఎటువైపు వచ్చేలా కట్టుకుంటే బాగుంటుంది?
జవాబు: డూప్లెక్స్ హౌజ్ కు దక్షిణ నైరుతి లేదా పడమర నైరుతి దిక్కు మెట్లు ఉండేలా కట్టుకోవాలి. ఇలాంటి వాటికి పూర్తి ఇంటి ప్లాన్ చూసిన తర్వాతే సరైన సలహా ఇవ్వాలి.
