అవార్డుల విషయంలో ప్రభుత్వం చొరవ

అవార్డుల విషయంలో ప్రభుత్వం చొరవ

వి బి ఎంటర్టైన్మెంట్స్ 2023 వెండితెర అవార్డ్స్‌‌ను శుక్రవారం నిర్వహించారు.  సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నటుడు, నిర్మాత మురళీమోహన్‌‌ను సన్మానించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ‘మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మురళీమోహన్.  ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ను సన్మానించడం ఆనందంగా ఉంది.  

విష్ణు బొప్పన పది సంవత్సరాలుగా విజయవంతంగా అవార్డ్స్ వేడుక నిర్వహిస్తున్నారు. ఆయనకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే  గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సి ఉన్న అవార్డులు అన్నిటినీ కూడా కచ్చితంగా ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది’ అని అన్నారు. ‘నా 50 సంవత్సరాల నట జీవితాన్ని పురస్కరించుకుని ‘నటసింహ చక్రవర్తి’ బిరుదునివ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది’ అన్నారు మురళీ మోహన్. 

‘ప్రతి  ఏడాది ఈ అవార్డ్స్‌‌తో పాటుగా పేద కళాకారుల పిల్లలకు స్కూల్ ఫీజులు, ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈసారి వికలాంగులకు చెక్కులు అందించాం’ అని విష్ణు బొప్పన చెప్పారు.