విద్యారంగానికి కాంగ్రెస్​పెద్దపీట : వెడ్మ బొజ్జు పటేల్

విద్యారంగానికి కాంగ్రెస్​పెద్దపీట : వెడ్మ బొజ్జు పటేల్
  • పెంబిలో కేజీబీవీ పాఠశాల ప్రారంభం

పెంబి, వెలుగు: గ్రామీణ ప్రాంత పిల్లలు విద్యపై శ్రద్ధపెట్టేలా వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించించాలని వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. పెంబి మండలం మందపల్లి గ్రామంలో కలెక్టర్ ఆశిష్​తో కలసి కేజీబీవీ పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివితే అనుకున్న లక్ష్యాలను సులువుగా  సాధించవచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. 

ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ఫైజన్ హైమద్, ఎంపీపీ కవిత, జడ్పీటీసీ జాను బాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల లక్ష్మి, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, సర్పంచ్ సుధాకర్, డీఈవో రవీందర్ రెడ్డి, పెంబి, ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు స్వప్నిల్ రెడ్డి, దయానంద్ పాల్గొన్నారు.

పేదల సంక్షేమానికి నిరంతరం కృషి 

జన్నారం: నిరుపేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని ఏంపీడీవో ఆఫీస్​లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పేదలకు రూ.10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశామని చెప్పారు. 

కొద్ది రోజుల్లో మిగతా గ్యారంటీ స్వీమ్​లను పక్కాగా అమలు చేస్తామన్నారు.  తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీపీ మాదాడి సరోజన, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, మాజీ ఏంపీపీ మచ్చ శంకరయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.