ట్యాంక్ బండ్, వెలుగు: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 417వ జయంతి ఉత్సవాలు ఆదివారం ట్యాంక్ బండ్లో ఘనంగా జరిగాయి. పోతులూరి విగ్రహానికి ఎమ్మెల్సీ మధుసూదనాచారి, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి దీపారాధన చేసి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరబ్రహ్మేంద్రస్వామి వర్ధంతి, జయంతి ఉత్సవాలను ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు. మొంథా తుఫాను ప్రభావంతో కడపలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు కూలిపోయిందని, దీనిని ఏపీ ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తాటికొండ శ్రీనివాస్ చారి, నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.
