టెన్త్ ఫలితాల్లో టాపర్‌గా కూరగాయల రైతు కొడుకు

టెన్త్ ఫలితాల్లో టాపర్‌గా కూరగాయల రైతు కొడుకు

స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన దుర్గేష్ కుమార్

పదవతరగతిలో ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాడు ఓ కూరగాయల రైతు కొడుకు. బీహార్‌ సమస్తిపూర్‌కు చెందిన దుర్గేష్ కుమార్ కూరగాయల రైతు కుమారుడు. తండ్రి కష్టపడి కొడుకును చదివిస్తున్నాడు. ఆ తండ్రి కష్టానికి ప్రతిఫలం దక్కింది. దుర్గేష్ ప్రస్తుతం టెన్త్ పూర్తిచేశాడు. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు పదవ తరగతి పరీక్ష ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఆ ఫలితాల్లో దుర్గేష్ 480 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. రోహ్తాస్ జిల్లాకు చెందిన హిమాన్షు రాజ్ 481 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించాడు. హిమాన్షు 96.2% మార్కులతో మొదటిస్థానంలో నిలవగా.. 96.1% మార్కులతో దుర్గేష్ రెండో స్థానంలో నిలిచాడు.

విద్యార్థులు తమ ఫలితాలను biharboardonline.com ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఈ పరీక్షలకు మొత్తం 14,94,071 మంది విద్యార్థులు హాజరుకాగా.. అందులో 2,89,692 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దాంతో బీఎస్ఇబీ ఉత్తీర్ణత శాతం 80.59 శాతంగా నమోదయింది.

For More News..

దేశంలో కొత్తగా 6,387 కరోనా కేసులు

తల్లిపై కిరోసిన్ పోసి నిప్పటించిన కొడుకు

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి