తూకం గిన్నె కింద క్యూఆర్ కోడ్.. ఆంటీ రాక్, కస్టమర్ షాక్..

తూకం గిన్నె కింద క్యూఆర్ కోడ్.. ఆంటీ రాక్, కస్టమర్ షాక్..

కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ ను వినియోగించే వారి సంఖ్య మరింత పెరిగింది. ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లోని వ్యాపారులు క్యూ ఆర్ కోడ్ తో చెల్లింపులను అంగీకరిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో సైతం దానికి సంబంధించిందే. ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డు పక్క న కూరగాయలు అమ్ముకుంటూ కనిపించింది. ఓ వ్యక్తి ఆమె దగ్గర కొనుగోళ్లు జరిపిన తర్వాత ఆమె.. అతనికి చెల్లింపు కోసం వెయింగ్ బౌల్ కింద ఉన్న క్యూ ఆర్ కోడ్ ను చూపించింది.

ALSO READ:ఆదిత్య ఎల్1 ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్..

@maharashtra.farmer షేర్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో, ఒక మహిళ తన కస్టమర్ కోసం వేరుశెనగలను ప్యాక్ చేయడం ఈ వీడియోలో చూడవచ్చు. కెమెరా వెనుక ఉన్న వ్యక్తి ఆన్‌లైన్ చెల్లింపును అభ్యర్థించినట్లుగానే, ఆ మహిళ వెయింగ్ స్కేల్‌పై ఉన్న గిన్నెను తిప్పి దాని  వెనకునన QR కోడ్ ను చూపించింది. ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది సేపటికే ఈ వీడియో వైరల్ గా మారింది. దాంతో పాటు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెట్టారు. "ఆంటీ రాక్, కస్టమర్ షాక్"  అని ఓ యూజర్ కామెంట్ చేశారు.