
కారు అదుపు తప్పి నదిలో పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. నిజ్ముల్లా-బిరాహి రోడ్డుపై వెళుతున్న కారు అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, మరొకరు ఆ నదిలో పడి గల్లంతయ్యారు. ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న NDRF బృందాలు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.