అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నైతిక విజయం మా ప్యానల్ దే : వెలిచాల రాజేందర్ రావు

అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నైతిక విజయం మా ప్యానల్ దే : వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్ సిటీ, వెలుగు: అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నైతిక విజయం తమ ప్యానెల్ దేనని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌‌‌రావు అన్నారు. కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కర్ర రాజశేఖర్ ప్యానెల్ బీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కర్ర రాజశేఖర్ వ్యవహారంపై హైకమాండ్‌‌ పెద్దలకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. తమ ప్యానెల్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారని కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. 

ఈసారి మూడు బ్యాలెట్లు ఇవ్వడం వల్ల  బ్యాంకు ఓటర్లలో కొంత గందరగోళం ఏర్పడిందన్నారు. తక్కువగా సమయం ఉండడం వల్ల ఈ విధానంపై తగిన అవగాహన కల్పించలేకపోయామన్నారు.  పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తమ ప్యానెల్ ద్వారా పోటీ చేశామని చెప్పారు.

 గెలిచిన డైరెక్టర్లకు అభినందనలు తెలుపుతూ అదేవిధంగా తమ ప్యానెల్ విజయానికి సహకరించిన అర్బన్ బ్యాంక్ మెంబర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు ఉయ్యాల ఆనందం, అనరాసు కుమార్, కాంగ్రెస్ నాయకులు చిందం శ్రీనివాస్, తాండ్ర శంకర్, ఎంఏ కరీం, కాసరపు కిరణ్, గండి గణేశ్‌‌, అనంతుల రమేశ్‌‌, తదితరులు పాల్గొన్నారు.