 
                                    ఆమనగల్లు, వెలుగు: తుపాన్ ప్రభావంతో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ సహదేవ్ సముద్రం చెరువు నాలుగున్నర దశాబ్దాల తర్వాత నిండి అలుగు పారుతోంది. గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెరువును సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దశాబ్దాల తర్వాత చెరువు నిండడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వెల్జాల్ చెరువు నిండడంతో మండలంతో పాటు మిడ్జిల్, ఊరుకొండ మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందడమే కాకుండా భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. ఇకముందు ప్రతి ఏటా చెరువు నిండి అలుగు పారాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఆయన వెంట వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసమూర్తి, యాట నరసింహ, ప్రభాకర్ రెడ్డి, రమేశ్ యాదవ్, అజీజ్ ఉన్నారు.

 
         
                     
                     
                    