ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం నిషేధించాలని నినదించిన గ్రామం

ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం నిషేధించాలని నినదించిన గ్రామం

కాగజ్ నగర్, వెలుగు: మద్య నిషేధం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ ​జిల్లా సిర్పూర్(టి) మండలం వేంపల్లి గ్రామస్తులు సోమవారం సిర్పూర్(టి)–కాగజ్‌‌నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. 

గ్రామంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుండడంతో మద్యపానం కారణంగా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనతో హైవేపై భారీగా ట్రాఫిక్‌‌ జామ్​ఏర్పడడంతో పోలీసులు చేరుకుని గ్రామస్థులతో చర్చించారు. మద్యం నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.