వేములవాడ రాజన్నహుండీ ఆదాయం రూ.1.88 కోట్లు

వేములవాడ రాజన్నహుండీ ఆదాయం రూ.1.88 కోట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నకు భారీగా హుండీ ఆదాయం సమకూరింది. రూ.1 కోటి 88 లక్షల నగదు, 255 గ్రాముల బంగారం, 15 కిలోల 800 గ్రాములు వెండి వచ్చాయని ఆలయ ఈవో డీ కృష్ణప్రసాద్‌ వెల్లడించారు. ఇదంతా కూడా 27రోజులకు చెందిన హుండీ ఆదాయమని స్పష్టం చేశారు. 

ఇక ఈసారి కార్తీక మాసంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి కాసుల వర్షం కురిసింది. నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని హుండీ ద్వారా రూ. 8 కోట్ల 25 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.