
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ మరణం దేశానికి తీరనిలోటన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సుష్మా మృతి పట్ల వెంకయ్య తీవ్ర సంతాపం తెలిపారు. సుష్మా మరణవార్త విని దిగ్భ్రాంతి చెందానన్నారు. అత్యుత్తమ ప్రతిభావంతురాలైన పార్లమెంటేరియన్‌గా సుష్మా మంచి పేరు తెచ్చుకున్నారన్నారు వెంకయ్య.