
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)-నీరజ (Neeraja)ల రెండో కూతురు హవ్యవాహిని (Havyavahini) వివాహం (మార్చి 15న) ఎలాంటి హడావిడి లేకుండా శుక్రవారం రాత్రి 9.36 నిమిషాలకు రామానాయుడు స్టూడియోలో జరిగింది.
విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు తనయుడు డాక్టర్ నిషాంత్తో హవ్యవాహిని ఏడడుగులు వేసింది. వీరి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు మాత్రమే హాజరైయారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోస్ చూసిన విక్టరీ ఫ్యాన్స్..కొత్త దంపతులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.హవ్యవాహిని మెహందీ ఈవెంట్లో మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి నమ్రత, సితార అటెండ్ అయ్యారు.
ఇకపోతే , వెంకటేష్,నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు.గతేడాది అక్టోబర్ 25న రాత్రి హవ్యవాహిని నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.ఆ వేడుకకు చిరంజీవి,మహేష్ కూడా హాజరయ్యారు.