Saindhav : డిసెంబర్ 22 న వెంకీ 'సైంధవ్'

Saindhav : డిసెంబర్ 22 న వెంకీ 'సైంధవ్'

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'సైంధవ్' .. వెంకటేష్ 75వ చిత్రంగా వస్తోన్న ఈ సినిమాను  2023 డిసెంబర్ 22 న  ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. భారీ పేలుడు పదార్థాలకు సంబంధించిన కంటైనర్ పై, తుపాకీ పట్టుకుని కూర్చున్న వెంకీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. 

https://twitter.com/NiharikaEnt/status/1641059223592386568?cxt=HHwWkIDS2emqm8YtAAAA

శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న  ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్నాడు. అతనికి ఇదే తొలిచిత్రం కావడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు . నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.