షూటింగ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయిన వెంకీ, కళ్యాణ్ రామ్.. మళ్లీ అదే ఫార్ములాతో అనిల్ రావిపూడి

షూటింగ్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయిన  వెంకీ, కళ్యాణ్ రామ్.. మళ్లీ అదే ఫార్ములాతో అనిల్ రావిపూడి

 వెంకటేష్,  కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.  తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఎవరనేది రివీల్‌‌‌‌‌‌‌‌ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో షైన్ స్ర్కీన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.  ఇదే బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భగవంత్ కేసరి, మన శంకర వరప్రసాద్‌‌‌‌‌‌‌‌ గారు చిత్రాలను అనిల్‌‌‌‌‌‌‌‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

 ఇక జీ స్టూడియో కూడా సహ నిర్మాతగా చేరింది.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని మేకర్స్ తెలియజేశారు.  త్వరలో  పూజా కార్యక్రమంతో  సినిమాను ప్రారంభించి, ఆ తర్వాత టైటిల్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర వివరాలను వెల్లడించనున్నట్టు చెప్పారు. అలాగే వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. 

ఎఫ్‌‌‌‌‌‌‌‌2, ఎఫ్‌‌‌‌‌‌‌‌3,   సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు లాంటి ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్స్‌‌‌‌‌‌‌‌ తర్వాత  వెంకటేష్‌‌‌‌‌‌‌‌తో కలిసి అనిల్ రావిపూడి  చేస్తున్న ఐదవ చిత్రమిది.   అలాగే ‘పటాస్‌‌‌‌‌‌‌‌’తో తనకు దర్శకుడిగా ఫస్ట్ చాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్‌‌‌‌‌‌‌‌తో రూపొందిస్తున్న రెండో చిత్రం. క్లీన్ అండ్ కంప్లీట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో తన  మార్క్ హ్యూమర్, ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు అనిల్ రావిపూడి తెలియజేశాడు.