కోలీవుడ్ హీరో ధనుష్‌‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘సార్‌‌‌‌’

కోలీవుడ్ హీరో ధనుష్‌‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘సార్‌‌‌‌’

కోలీవుడ్ హీరో ధనుష్‌‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘సార్‌‌‌‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సంయుక్త మీనన్ హీరోయిన్. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఇప్పటికే టీజర్‌‌‌‌తో ఆకట్టుకున్న టీమ్, గురువారం ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్‌‌ను రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ మెలోడియస్‌‌ ట్యూన్‌‌కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. ‘మాస్టారూ మాస్టారూ నా మనసును గెలిచారు.. అచ్చం నే కలగన్నట్టే, నా పక్కన నిలిచారు’ అంటూ సాగే లిరిక్స్‌‌ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా పాడింది  సింగర్ శ్వేతా మోహన్. కాలేజ్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో తీసిన ఈ పాటలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో పాటు జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. తమిళంలో ఈ పాటను ధనుష్ రాయడం విశేషం. విద్యా వ్యవస్థ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో  బాల గంగాధర్ తిలక్ అనే జూనియర్ లెక్చరర్‌‌‌‌గా ధనుష్ నటిస్తున్నాడు. సాయికుమార్, తనికెళ్ల భ‌‌ర‌‌ణి, సముద్ర ఖని, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, ఆడుకాలం నరేన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.