ఆపరేషన్ కగార్‎ను నిలిపివేయాలి:వెన్నెల గద్దర్

ఆపరేషన్ కగార్‎ను నిలిపివేయాలి:వెన్నెల గద్దర్

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్.ఆదివాసీ బిడ్డలను మావోయిస్టులుగా చిత్రీకరించి హత్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. 

ఎన్ కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తెలంగాణ గవర్నర్ కు వినతిపత్రం అందజేశామన్నారు. ఆపరేషన్ కగార్ ప్రజలంతా పెద్దఎత్తున ఖండించాలని కోరారు.వెంటనే కేంద్రం స్పందించి సీజ్ ఫైర్ చేయాలని డిమాండ్ చేశారు. 

గద్దర్ సతీమణి విమల మాట్లాడుతూ.. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలన్నారు. మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించి జనజీవన స్రవంతిలో కలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.