Chaari 111 OTT: మొన్నే థియేటర్స్కి.. అప్పడే OTTకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Chaari 111 OTT: మొన్నే థియేటర్స్కి.. అప్పడే OTTకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ చారి 111(Chaari 111). హాలీవుడ్ కమెడియన్ మిస్టర్ బీన్ హీరోగా వచ్చిన జానీ ఇంగ్లీష్ సినిమా ఆధారంగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు టీజీ కీర్తికుమార్(TG Keerthi kumar) తెరకెక్కించారు. సంయుక్త విశ్వనాథన్(Samyuktha Vishwanath) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. మురళీశర్మ, తాగుబోతు రమేష్‌,సత్య కీ రోల్స్ చేశారు. 

ఈ సినిమా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది చారి 111. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా డిటైటల్ హక్కులని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్‌, ఆహా ఓటీటీలు మార్చ్ 16 నుండి చారి 111 సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నామని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. మరి థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

Also Read :నా భర్త నన్ను వేలం వేసి స్నేహితులతో