సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమళ్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం పాములు కలకలం రేపాయి. స్కూల్లోని క్లాస్ రూమ్స్‌లో పాములు కనిపించడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. కట్ల, రక్త పింజరి వంటి విషపూరితమైనవిగా పాము పిల్లలుగా గుర్తించారు.
స్కూల్ ఆవరణలో విష సర్పాలు కనిపించడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. పాత క్లాస్‌రూమ్‌ల గోడలు పూర్తిగా పగుళ్లు తేలడం, పైకప్పు శిథిలావస్థకు చేరుకోవడంతో పాములు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
