వనపర్తి డిపోలో ఫెస్టివల్ ఛాలెంజ్: వేణుగోపాల్

వనపర్తి డిపోలో ఫెస్టివల్  ఛాలెంజ్: వేణుగోపాల్

వనపర్తి, వెలుగు: వంద రోజుల ఆర్టీసీ పండుగ సందర్భంగా వనపర్తి డిపోలో గ్రాండ్  ఫెస్టివల్  ఛాలెంజ్  స్కీంను ఆదివారం డిపో మేనేజర్ వేణుగోపాల్  ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ దసరా,  దీపావళి,  క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా  ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతూ, సంస్థను లాభాల బాట పట్టించాలన్నారు.

గత ఏడాది రాఖీ పండుగ ఛాలెంజ్  సందర్భంగా జోనల్ లో రెండో స్థానం వచ్చిందని, ఈ ఏడాది కూడా లక్ష్యాన్ని సాధించాలని కోరారు. అసిస్టెంట్  మేనేజర్ దేవేందర్ గౌడ్, టీఐ ఎం కృష్ణయ్య, సాయిరెడ్డి, కేఎస్​ శెట్టి, బీఆర్  శేఖరయ్య, రాములు, జేవీ స్వామి, చలపతి రెడ్డి పాల్గొన్నారు.