Netflix: ఇంట్లోని సామాన్లతో పాస్వర్డ్ వెరిఫికేషన్

Netflix: ఇంట్లోని సామాన్లతో పాస్వర్డ్ వెరిఫికేషన్

ఓటీటీ సబ్ స్ర్కిప్షన్ ఒకరు తీసుకుంటే చాలు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ పాస్ వర్డ్ షేర్ చేసుకొని వాడుకుంటుంటారు. అయితే, ఇకనుంచి అలా కుదరదు. పాస్ వర్డ్ షేరింగ్ ని అరికట్టడానికి నెట్ ఫ్లిక్స్ కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. నెట్ ఫ్లిక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇంట్లోని సామాన్లతో వెరిఫై చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఎవరైనా కొత్తగా లాగిన్ అయ్యేవాళ్లు ఆ సామాన్లను వెరిఫై చేస్తేనే వేరొక డివైజ్ లో లాగి న్ కావడానికి వీలుంటుంది. ఈ రూల్ ని ప్రస్తుతం అమెరికాలో అమలు చేశారు. ఈ నిర్ణయం వల్ల జీవనోపాధి కోసం ప్రయాణించే వ్యక్తులు, తల్లిదండ్రులకు దూరంగా ఉండే స్టూడెంట్స్, రెండు ఇండ్లు ఉన్నవాళ్లకు ఈ రూల్స్ తో ఇబ్బంది ఏర్పడుతుంది.

నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్స్ షేర్ చేయడంవల్ల సబ్ స్క్రైబర్ల సంఖ్య తక్కువ, యూజర్ల సంఖ్య ఎక్కువ పెరిగిపోతోందట. దానివల్ల నెట్ ఫ్లిక్స్ ఏటా నాలుగు కోట్ల వరకు నష్టపోతోందట. ఆ నష్టాన్ని తగ్గించడానికి నెట్ ఫ్లిక్స్ సీఈఓ, కో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెడ్ సరండోస్, గ్రెగ్ పీటర్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.